Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంత బ్యానర్లో మహేశ్ సినిమా .. గెస్ట్ రోల్!

  • చిన్న సినిమాల కోసం కొత్త బ్యానర్ 
  • నిర్మాణ వ్యవహారాల్లో నమ్రత
  • 30 నిమిషాల నిడివి కలిగిన గెస్టు రోల్
ఒక వైపున థియేటర్ బిజినెస్ పై దృష్టి పెట్టిన మహేశ్ బాబు .. మరో వైపున చిన్న సినిమాల నిర్మాణానికి గాను సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాడు. జి.మహేశ్ ఎంటర్టైన్ మెంట్స్ పేరుతో ఈ బ్యానర్ ను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ బ్యానర్ కి సంబంధించిన సినిమాల నిర్మాణ వ్యవహారాలను మహేశ్ బాబు శ్రీమతి నమ్రత చూసుకుంటారు.

ఈ బ్యానర్ పై తొలి సినిమా కోసం ఆమె ఒక ఎమోషనల్ డ్రామాను కూడా ఓకే చేసి పెట్టారని సమాచారం. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. 30 నిమిషాల నిడివి కలిగిన ఆ గెస్టు పాత్రలో మహేశ్ చేస్తే బాగుంటుందని నమ్రత చెప్పడంతో, ఆ పాత్రను చేయడానికి ఆయన అంగీకరించాడని అంటున్నారు. మహేశ్ చేస్తోన్న మొదటి గెస్టు రోల్ ఇదే అవుతుంది.  
mahesh
namrata

More Telugu News